
పచ్చని ఉద్దానాన్ని రాళ్లురప్పలతో పోల్చొద్దు
మందస: నిత్యం పంటలతో పచ్చగా కళకళలాడే ఉద్దానాన్ని రాళ్లురప్పలతో కూడిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు భూములతో పోల్చడం సరికాదని కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అన్నారు. గురువారం మందస మండలం గంగువాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఉద్దానాన్ని శంషాబాద్ ప్రాంతంతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం బత్తిన లక్ష్మణ్ మాట్లాడుతూ కొబ్బరి, జీడి, పసన, మామిడి, మునగ, అరటి, జామ, నిమ్మ తదితర పంటలతో కూడిన పచ్చని నేలతల్లిని విడిచి వెళ్లిపోవాలని ఎలా అనగలుగుతున్నారని ప్రశ్నించారు.
కార్యక్రమంలో పొట్టి ధర్మారావు, ఎర్రయ్య, నారాయణ, దున్న హరికృష్ణ, శాంతారావు, శంకర్, చలపతి, సోమేశ్వరరావు, దున్న రామారావు, సంతోష్, శ్యామ్ పాల్గొన్నారు.