
అచ్యుతానందన్ మృతి తీరని లోటు
రణస్థలం: కార్మిక, కర్షక, పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత పోరాట యోధుడు కామ్రేడ్ అచ్యుతానందన్ మరణించడం కార్మిక పోరాటాలకు తీరని లోటు అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసలోని శ్యాంపిస్టన్ ప్లాంట్–3 పరిశ్రమ వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 102 ఏళ్ల జీవన ప్రయాణంలో 85 ఏళ్ల తన జీవితాన్ని ప్రజలు, కార్మికులు కష్టజీవుల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం వెచ్చించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎం.అశోక్, ఎల్.నాగరాజు, జె.సురేష్, ఎం.సునీల్, పి.శ్రీను, కృష్ణారావు, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.