
పుస్తెల తాడు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు
కొరాపుట్: పుస్తెల తాడు చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు నబరంగ్‌పూర్ ఎస్‌డీపీవో కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తేదీన డొంగ్రుబజ గ్రామంలో ప్రశాంత్ పాత్రో భార్య సరోజని పాత్రో తన కిరాణా షాపులో విక్రయాలు చేస్తోంది. అదే సమయంలో తెంతులకుంటి సమితి కూర్మాకోట్ గ్రామానికి చెందిన దిలీప్ దాస్ అమె మెడలో బంగారు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేసి 07.55 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు.