
ఎయిమ్స్‌లో బాధితురాలి వాంగ్మూలం నమోదు
భువనేశ్వర్: స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆస్పత్రిలో పూరీ జిల్లా బలంగ ప్రాంతపు బాధితురాలి వాంగ్మూలం శనివారం నమోదు చేశారు. ఖుర్ధా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందజేసేందకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో వైద్య వివిధ విభాగాల నుంచి 14 మంది నిపుణులు ఉన్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలియ జేశారు.
ఠాణాలో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు
భువనేశ్వర్: దుండగులు నిప్పు అంటించిన సంఘటనలో బాధిత బాలిక తల్లి పూరీ జిల్లా నిమ్మాపడా బలంగా పోలీసు ఠాణాలో శనివారం ఫిర్యాదు చేశారు. ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తన కుమార్తెను రుమాలుతో నోటికి కట్టేసి చెరువు గట్టు ప్రాంతానికి బలవంతంగా తీసుకుని వెళ్లి తీవ్ర అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మానుష్య చెరువు గట్టు ప్రాంతంలో కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు. ఘాతుకానికి పాల్పడిన దుండగులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు.
విలేకరి హత్య కేసులో
నిందితుల గుర్తింపు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసు స్టేషన్ పరిధిలో ఓ విలేకరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే పోలీసులు నిందితులను గుర్తించారు. సుకుమార్ రౌయి, జోన్ జోర్జాద్ అనే ఇద్దరు ఎంవీ 75, ఎంవీ 82 గ్రామాలకు చెందిన వారు వారు. వీరిద్దరూ విలేకరిపై దాడి చేశారని, హైదరాబాద్‌లో వీరిని పట్టుకున్నామని ఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు.

ఎయిమ్స్‌లో బాధితురాలి వాంగ్మూలం నమోదు