
రెంగాలో బీజేపీ నాయకుల పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి రెంగా గ్రామంలో బీజేపీ నాయకులు గురువారం పర్యటించారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విభాగం ఉపాధ్యక్షులు కాళీరాం మాఝి, జిల్లా కన్వీనర్ దుష్మంత్ కుమార్ సింగ్ దేవ్, నీలాద్రీబిహారి పాత్రో, తదితరులు పర్యటించి అక్కడి వారితో మాట్లాడారు. గ్రామానికి కనీసం సరైన రహదారి కూడా లేదని నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వంద కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో ఆవాస్ గృహాలు ఇంతవరకు ఎవ్వరికీ మంజూరు చేయలేదన్నారు. తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతీ గ్రామంలో పర్యటించి మౌలిక సౌకర్యాలు, సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మాఝి తెలియజేశారు.