వీధినపడిన బొలంగీర్‌ రాజ కుటుంబీకుల అంతర్గత విబేధాలు

- - Sakshi

భువనేశ్వర్‌: బొలంగీర్‌ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్‌ నారాయణ సింఘ్‌దేవ్‌ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు ఠాణాకు చేరింది. అర్కేష్‌ వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను అర్కేష్‌ సింఘ్‌దేవ్‌ ఖండించారు. దాదాపు 6నెలల క్రితం ఈ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. ‘ఆమె నాపై గృహహింస కేసు పెట్టడంతో నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారు.

అవసరమైన వస్తువులు తీసుకునేందుకు నెలకోసారి మాత్రమే ఇంటికి వెళ్తున్నాను. పోలీసుల సలహా మేరకు ఆమె, నా భద్రతను నిర్థారించడానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించా. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించా’నని అర్కేష్‌ వివరించారు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ వద్దకు వచ్చి చేసిన డిమాండ్‌ పట్ల ప్రతికూలించినట్లు అర్కేష్‌ నారాయణ సింఘ్‌దేవ్‌ తెలిపారు.

వివాదం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం మేరకు కొనసాగడం జరుగుతుందని పదేపదే ప్రాధేయపడినా.. ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సహరాపూర్‌లోని కొందరు ల్యాండ్‌ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అద్రిజా ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్త 2022 ఆగస్టులో విడాకులు కోరినట్లు తెలిపారన్నారు.

డీజీపీని కలిసి..
ఇదిలా ఉండగా.. అర్కేష్‌ సింఘ్‌దేవ్‌ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్‌ దేవ్‌, బావ కళికేష్‌ నారాయణ్‌ సింఘ్‌దేవ్‌, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్‌ 30న రాజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరా ఏర్పాటు చేసి ప్రతి కదలికపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) సునీల్‌ బన్సాల్‌ను కలిశారు. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏస్పీ)కి అప్పగించారు.

వీపీ సింగ్‌ మనుమరాలు..
అర్కేష్‌ సింఘ్‌దేవ్‌ గతంలో కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్‌ లోని స్థానిక మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌(వీపీ సింగ్‌) మనవరాలైన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్‌లో ఉంటున్నారు. అర్కేష్‌, అద్రిజాల 2017 నవంబర్‌లో జరిగింది.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top