● వివాహేతర సంబంధంలో
ఉన్న వ్యక్తే నిందితుడు
● మృతురాలిది కై కలూరు
మండలం వింజరం
● నిందితుడిని అరెస్టు చేసిన
కంకిపాడు పోలీసులు
కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ... ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ (33) కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్‌బాబు అలియాస్ వినోద్‌కుమార్‌తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు. జొన్నాదుల మేరీ శివకుమార్ భార్యాభర్తలు. అయితే కై కలూరులోని ఓ హోటల్‌లో మేరీ పనిచేస్తూ ఉండేది. అక్కడికి ట్రాక్టరు నడిపే పనులకు వచ్చిన వినోద్‌బాబుతో పరిచయం ఏర్పరుచుకుంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అదే క్రమలో వినోద్‌బాబు, మేరీలు తెన్నేరులో ఇటుకల బట్టీల పనులకు వచ్చారు.
అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు..
మేరీ తాను పనిచేసిన హోటల్‌లో వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్‌బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇరువురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈనెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైట్ ప్యాంటుతో మేరీ మెడకు బిగించి ఊపరాడకుండా చేసి హత్యచేసి పరారయ్యాడు. ఘటనపై మృతురాలి భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పడి నిందితుడు వినోద్‌బాబు కోసం విస్తృతంగా గాలించారు. నిందితుడిని కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్‌ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్‌ఎస్‌ఐ కె.సురేష్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.


