విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Mar 26 2026 7:19 AM | Updated on Mar 26 2026 7:19 AM

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026 సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే! మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు లా పరీక్ష కేంద్రంలో వీసీ తనిఖీ విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి స్వాధీనం జల్‌ జీవన్‌ మిషన్‌పై చిత్తశుద్ధి లేదు.. వేసవికి ముందే దుర్గమ్మకు రూ. 2.75లక్షల విరాళాలు సముద్ర బాట పట్టిన తాబేళ్ల పిల్లలు సమగ్ర భూ సర్వే పరిశీలన సుబ్బారాయుడి హుండీ ఆదాయం రూ. 89.17లక్షలు ● మైలవరం మండల పరిధిలో దేవుని చెరువు, తోలుకోడు, వెల్వడం, చంద్రాల, కీర్తిరాయినిగూడెం గ్రామాలలో పైపులైన్‌ల మరమ్మతులు, మోటార్ల రిపేర్ల వల్ల అప్పుడప్పుడు తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● రెడ్డిగూడెం మండల పరిధిలోని రెడ్డిగూడెం, కొత్తనాగులూరు గ్రామాల్లో మోటార్లు పని చేయక అప్పుడప్పుడు నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ● ఇబ్రహీంపట్నం మండల పరిధిలో కొండపల్లి బొమ్మల కాలనీలోపైపులైన్‌ ఉన్నప్పటికీ ఎనిమిది నెలలుగా తాగునీటి సరఫరానే లేక స్థానికులు నరకయాతన పడుతున్నారు. ● కంచికచర్ల మండల పరిధి మోగులూరు, వేములపల్లి, గొట్టిముక్కల, కంచికచర్ల, పరిటాల, వీరులపాడు, చందర్లపాడు, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో, వత్సవాయి మండల పరిధిలో భీమవరం, మక్కపేట, మంగొల్లు, వత్సవాయి, ఖమ్మంపాడు, మాచినేనిపాలెం గ్రామాలలో మోటార్ల రిపేర్లు, పైపులైన్‌ల మరమ్మతుల వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● జగ్గయ్యపేట మండల పరిధిలో జయంతిపురం, రావిరాల, చిల్లకల్లు, అన్నవరం గ్రామాలు, పెనుగంచిప్రోలు మండల పరిధిలో పలు గ్రామాలలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ● ఏ.కొండూరు మండల పరిధిలో 32 గ్రామాలకు కృష్ణావాటర్‌ పైపులైను ఏర్పాటు పూర్తికాక, కొన్ని గ్రామాలలో పాత పైపులైన్‌లకే కృష్ణావాటర్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో సరఫరా సమస్య తలెత్తి తాగేందుకు నీరు లేక నరకయాతన పడుతున్నారు. ● తిరువూరు మండల పరిధిలో వావిలాల, ఎర్రమాడు, గంపలగూడెం మండల పరిధిలో కొణిజర్ల, ఊటుకూరు గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. ● విజయవాడ నగరంలో సైతం వేసవిలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొనక తప్పడం లేదు. తాగునీరు రావడం లేదు.. దివ్వెల పండుగలో దోపిడీ పర్వం! మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లాలో రూ.150కోట్లకు పైగా బాణసంచా విక్రయాలు లెక్కల్లో రెండు కోట్లు కూడా దాట లేదంటున్న వాణిజ్య పన్నుల శాఖ భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి డివిజన్‌–3లో భారీ అక్రమాలంటూ ఆరోపణలు

గ్రామీణ ప్రాంతాలలో

ఇప్పటికే ప్రారంభమైన ఇక్కట్లు

పైపులైన్‌లు, మోటార్లు, చేతిపంపులు మరమ్మతులతో నిత్యం సమస్య

నిర్లక్ష్యం వీడకపోతే మండుటెండల్లో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం

గతేడాది దీపావళి వేళ మోతమోగిన ‘వసూళ్ల’ టపాసులు

ఒకే వ్యాపారి.. రూ.9కోట్ల సరుకు

ఎన్టీఆర్‌ జిల్లా
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే!
మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
లా పరీక్ష కేంద్రంలో వీసీ తనిఖీ

సాగర్‌ నీటిమట్టం వివరాలు

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం.

ఎనిమిది మంది అంతర్‌ రాష్ట్ర

గంజాయి ముఠా అరెస్టు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఈగల్‌ బృందం అరెస్టు చేసి, వారి నుంచి 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్‌ బృందం, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, డాగ్‌ స్క్వాడ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఈగల్‌ బృందం, ఇతర భద్రతా దళాలతో కలసి జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 8 మంది అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు.

ఒడిశా నుంచి..

గంజాయి ముఠా సభ్యులు ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని కేరళ, తిరుపతి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విజయవాడ మీదుగా గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాల రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రవీంద్ర హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌లు జె.వి.రమణ, డి.నాగార్జున, ఎస్‌లు ఎం. వీరాంజనేయులు, రాంబాబు, డాగ్‌ స్వ్కాడ్‌ ఆర్‌ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సమర్థంగా పనులు చేపట్టి ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్‌ జిల్లాలో 1,10,727 ఇంటింటి కుళాయి కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ పథకం మరుగున పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి, ఉచిత ప్రసాద వితరణకు ముదునూరుకు చెందిన భక్తులు బుధవారం రూ. 2.75లక్షల విరాళాన్ని అందజేశారు. యలమంచిలి రంగారావు అమ్మవారి అన్నదానానికి రూ. 1.40లక్షలు, యలమంచిలి సీతా మహాలక్ష్మి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1.35లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించారు.

కోడూరు: సముద్ర కాలుష్యాన్ని నివారించే అరుదైన ఆలీవ్‌ రిడ్లే తాబేళ్ల పిల్లలను అటవీ అధికారులు బుధవారం సముద్ర బాట పట్టించారు. హంసలదీవి సాగరతీరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలీవ్‌ రిడ్లే తాబేళ్లు తీరంలోని ఇసుకతిన్నెల వెంట గుడ్లు పెట్టగా, వాటిని అటవీ సిబ్బంది సేకరించి నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర సంతానోత్పత్తి కోసం ప్రత్యేక కేంద్రంలో వాటిని భద్రపర్చారు. ప్రస్తుతం తొలివిడతగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 123 తాబేళ్ల పిల్లలను సముద్ర బాట పట్టించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని, తాబేళ్ల పిల్లలను సముద్రం వైపునకు విడిచిపెట్టారు. వైల్డ్‌ లైఫ్‌ ఏలూరు డివిజన్‌ డీఎఫ్‌ఓ త్రిమూర్తుల రెడ్డి, అటవీ రేంజర్‌ ఎస్‌వీకే కుమార్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి టి.నాగమణి, ఎఫ్‌బీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎ.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమాహాలు వద్ద జరుగుతున్న సర్వే పనులను తహసీల్దార్‌ ఎన్‌.అరవింద్‌తో కలసి పరిశీలించారు. భూ సర్వే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఉపయోగిస్తున్న పరికరాలను జేసీ పరిశీలించారు. సర్వే ద్వారా స్పష్టమైన రికార్డులు సిద్ధమవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ. 89,17,515 నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్‌ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, బోగిరెడ్డిపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎన్‌. అరుణ సమక్షంలో కానుకలు లెక్కించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ మొత్తం 76 రోజులకు గాను రూ. 89,17,515నగదు, బంగారం 44.004 గ్రాములు, వెండి 1.686 కిలోలు, అమెరికా డాలర్లు 129, ఇంగ్లాండ్‌ కరెన్సీ 5, ఆస్ట్రేలియా కరెన్సీ 20 సమకూరినట్లు వివరించారు. లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

జి.కొండూరు: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా తాగునీటి సమస్య తలెత్తుతోంది. మోటార్లు, పైపులైన్‌ల మరమ్మతుల సమస్యతో తాగునీటి సరఫరాకి బ్రేక్‌పడి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకనే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే కరువు సంభ విస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎనిమిది నెలలుగా తాగునీరు లేక..

జి.కొండూరు మండల పరిధిలో దుగ్గిరాలపాడు గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణా నీరు సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు నరకయాతన పడుతున్నా రు. గ్రామంలో 1200మంది వరకు జనాభా ఉండగా గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండటంతో వీరంతా కృష్ణావాటర్‌పైనే ఆధారపడ్డారు. దీంతో వీరు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగినేని వెళ్లి ప్యూరిఫైడ్‌ వాటర్‌ని తెచ్చుకుంటున్నారు. వీలుకాని వాళ్లు ఫ్లోరైడ్‌ నీటినే తాగుతున్నారు. అదేవిధంగా గంగినేని, తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, చెర్వుమాధవరం గ్రామాలకు పైపులైన్‌ సమస్యతో నెలకు ఒకసారి చొప్పున కృష్ణా నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరప్పాడు, చిన్ననందిగామ గ్రామాలకు కృష్ణావాటర్‌ పైపులైను లేక తాగునీరు అందుబాటులో లేక వాటర్‌ ప్లాంట్‌లకు పరుగులు పెడుతున్నారు.

జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు..

మా గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణావాటర్‌ రావడం లేదు. తాగేందుకు నీరులేక గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పైపులైన్‌లు లీకుల వల్ల నీళ్లు రావడంలేదని చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా లీకులకు మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గం. గ్రామస్తులంతా వాటర్‌ ప్లాంట్‌లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

– జడ రాంబాబు, సర్పంచ్‌,

దుగ్గిరాలపాడు

సేవలకు సత్కారం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దీపావళి బాణసంచా వ్యాపారం వాణిజ్య పన్నుల శాఖలోని కొంతమంది ఉద్యోగులకు భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది! ఉమ్మడి కృష్ణాజిల్లాలో బాణసంచా వ్యాపారం ఏటా పెరుగుతుంటే వాణిజ్య పన్నుల శాఖ నివేదికల్లో మాత్రం భారీగా దిగజారుతోంది. అయితే ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఆ శాఖలో ఉద్యోగులే గండికొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఆ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లోని లెక్కలే ఆధారాలుగా కనిపిస్తున్నాయి.

అసలు ఏమైందంటే..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో దీపావళి పర్వదినం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే భారీగా బాణసంచా వ్యాపారం జరుగుతుంది. రెండు జిల్లాల్లో విజయవాడతో పాటుగా గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో భారీగా వ్యాపారం సాగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యాపారుల ద్వారా సుమారుగా రూ.150కోట్ల నుంచి రూ.175కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే ఆ వ్యాపారం అధికారిక లెక్కల్లో మాత్రం కనపడటం లేదు. దాంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు భారీగా గండి పడుతోంది. మొత్తం అధికారికంగా లెక్కల్లోకి వస్తే సుమారుగా 28 శాతం జీఎస్‌టీ చొప్పున రూ.40 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

అధికారిక లెక్కల్లో ఇలా..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇటీవల జరిగిన దీపావళి బాణసంచా వ్యాపారం కనీసం రెండు కోట్లు సైతం దాటలేదని ఆ శాఖ నివేదికలు తెలియజేస్తున్నట్లుగా తెలిసింది. విజయవాడ డివిజన్‌–1, డివిజన్‌–2, డివిజన్‌–3 కొనసాగుతున్నాయి. మూడు డివిజన్‌ల పరిధిలో 17 సర్కిల్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. డివిజన్‌–1 పరిధిలో సుమారుగా రూ.25 లక్షలు, డివిజన్‌–2 పరిధిలో సుమారుగా కోటి రూ.20 లక్షలు, డివిజన్‌ –3 పరిధిలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వ్యాపారం జరిగినట్లుగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు లెక్కిస్తే మొత్తం కలిపినా రెండు కోట్లు దాటలేదని కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. గత ఏడాదిలో మూడు డివిజన్‌ల పరిధిలో రూ.18 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లుగా తెలిసింది.

40 మంది శాశ్వత వ్యాపారులు..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 30 నుంచి 40 మంది వ్యాపారులు దశాబ్దాలుగా అన్ని లైసెన్స్‌లు కలిగి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు శాశ్వత పద్ధతిలో ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరు కాకుండా ప్రతి ఏడాది రెండు నుంచి మూడు వందల మంది తాత్కాలికంగా ఆ పండుగ సమయంలో ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి అనుమతి తీసుకొని వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఆ లెక్కన కేవలం డివజిన్‌–2 పరిధిలో మాత్రమే అధిక సంఖ్యలో తాత్కాలిక వ్యాపారులు నమోదు చేసుకొని వ్యాపారం చేసినట్లుగా, ఆ మేర ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

డివిజన్‌–3 పరిధిలో..

దీపావళి సమయంలో అత్యధికంగా బాణసంచా విక్రయాలు చేసే పెద్ద దుకాణాలు డివిజన్‌–1 పరిధిలో నాలుగైదు ఉండగా.. విజయవాడ–3 డివిజన్‌ పరిధిలో అత్యధికంగా ఉన్నాయి. వీరంతా గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. గుడివాడ పరిధిలో ఇటీవల జరిగిన వ్యాపారం సమయంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు భారీగా ముడుపులు తీసుకొని ఉన్నతాధికారులకు చిక్కారు. తమిళనాడు నుంచి భారీగా బాణసంచా నిల్వలను తెప్పించిన వ్యాపారికి సంబంధించి సరుకును అధికారులు గుర్తించటంతో దానిని సద్దుమణిగించటానికి ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వివాదం ఆ తరువాత వదిలేశారు. ఆ వివాదంలో ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ఉమెన్‌ హుడ్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘రైజ్‌’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా, కేవలం ఆలోచనతో వస్తే చాలని, వారికి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్‌ మెలకువలు, సాంకేతిక సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నర్‌వీల్‌ ఇంటర్నేషనల్‌ మాజీ కోశాధికారి సరిత లునాని, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్‌ చైర్‌ పర్సన్‌ అమ్రిత కుమార్‌, కలెక్టర్‌ సతీమణి సుప్రిత, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్‌ సీనియర్‌ చైర్‌ పర్సన్‌ సుప్రియ మలినేని తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శాప్‌ చైర్మన్‌ ఏ. రవినాయుడు చెప్పారు. స్థానిక బందరు రోడ్డులోని శాప్‌ ప్రధాన కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. శాప్‌ ఎండీ ఎస్‌.భరణీతో పాటుగా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, ఇతర విద్యాసంస్థలను కలుపుకొని ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్‌ కోచ్‌లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు, రిటైర్డ్‌ ఉద్యోగులు సేవలను వినియోగించుకుంటామన్నారు. విద్యార్థులు, యువత ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు.

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న లా పరీక్షల కేంద్రాన్ని బుధవారం కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన లా మొదటి, ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి కృష్ణా విశ్వ విద్యాలయ ఫార్మసీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మచిలీపట్నం దైత శ్రీరాములు హిందూ లా కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి రాంజీ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

7

ఎన్టీఆర్‌ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద

తాగునీటి సరఫరా వివరాలు

తాగునీటి సరఫరా హ్యాబిటేషన్‌లు 794

గ్రామాలు 321

జనాభా 9,87,854

కుటుంబాలు 2,67,574

ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు 1,10,727

సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 19 ట్యాంకులు

రక్షిత మంచినీటి పథకాలు 375 ట్యాంకులు

మీడియం రక్షిత మంచినీటి పథకాలు 63 ట్యాంకులు

డైరెక్ట్‌ పంపింగ్‌ స్కీములు 508

చేతి పంపులు 7,846

డివిజన్‌–3 పరిధిలోని ఒక వ్యాపారి తమిళనాడు నుంచి సుమారుగా తొమ్మిది కోట్ల మేర సరుకును తెప్పించినట్లుగా తెలిసింది. ఈ మేరకు పక్క రాష్ట్రం నుంచి వేబిల్లును సైతం తెచ్చారని ఒకరిద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకే వ్యాపారి ఇంత పెద్ద ఎత్తున సరుకు తీసుకొస్తే 40 మంది పెద్ద వ్యాపారులు మొత్తం ఎంత సరుకు దిగుమతి చేసుకొని ఉంటారో అర్థం చేసుకోవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీపావళి పండుగ సమయంలో అత్యధిక వ్యాపారం జరిగే దుకాణాలు, పెద్ద వ్యాపారులు డివిజన్‌–3 పరిధిలోనే ఉన్నట్లుగా గతంలో జరిగిన నివేదికలు వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పండుగ సమయంలో జరిగిన వ్యాపారానికి సంబంధించిన నివేదికల్లో కనిపిస్తున్న నామమాత్రం లెక్కలు చూసి ఆ శాఖ అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement