విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రామంలో చెప్పుల కంపెనీ ఎదురు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. నున్న ఎస్‌ఐ విమల కథనం మేరకు.. నూజివీడు వెళ్లే రోడ్డులో చెప్పుల తయారీ కంపెనీకి ఎదురుగా ఖాళీగా ఉన్న పొలాల్లో గుర్తు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వంటిపై తెలుపు రంగు చొక్కా, కండువా ఉన్నాయి. నార్త్ ఏసీపీ పి.సత్యానందం, నున్న సీఐ పి.కృష్ణమోహన్, ఎస్‌ఐ విమల, పోలీసు సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


