ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయ వాడ చలసాని నగర్‌కు చెందిన వై.శ్రీరామ్, మేఘన దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సూర్యకుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. ఆలయ అభివృద్ధి నిమిత్తం తమిళనాడు మధురైలోని సౌత్ మాశీ వీధికి చెందిన విశ్వనాథన్ రూ.లక్ష విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


