కూటమి వైఫల్యాలను నిలదీస్తున్నందుకే అక్రమ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కూటమి వైఫల్యాలను నిలదీస్తున్నందుకే అక్రమ అరెస్టు

Nov 9 2025 6:47 AM | Updated on Nov 9 2025 6:47 AM

కూటమి వైఫల్యాలను నిలదీస్తున్నందుకే అక్రమ అరెస్టు

కూటమి వైఫల్యాలను నిలదీస్తున్నందుకే అక్రమ అరెస్టు

జోగి రమేష్‌ కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ నేతల పరామర్శ

పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమే జోగి రమేష్‌ అక్రమ అరెస్టని విమర్శ

ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రతో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు శనివారం పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ సెంట్రల్‌, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌ రావు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు జోగి రమేష్‌ సతీమణి శకుంతలమ్మ, కుమారులు జోగి రాజీవ్‌, రోహిత్‌కుమార్‌ను పరామర్శించారు. అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేద్దామని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రజాసమస్యలపై పోరాడుతున్నందునే..

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జోగి రమేష్‌ను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్‌ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ ఇతర నాయకులు తప్పుడు కేసులు సృష్టించి అన్యాయంగా జైలుకు పంపారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీకి చెందిన వ్యక్తి నకిలీ మద్యం తయారు చేస్తుంటే, దానిని బయటపెట్టిన వ్యక్తి జోగి రమేష్‌ అని స్పష్టం చేశారు. బీసీ నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్‌పై రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయించారని, కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. జోగి రమేష్‌ సతీమణి శకుంతలమ్మ కన్నీటిలో కూటమి నాయకులు కొట్టుకుపోయే రోజు త్వరలో వస్తుందన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో దాదాపు పది మంది వరకు చనిపోయిన విషయాన్ని పక్కదోవ పట్టించడానికి జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేసిందన్నారు. టీడీపీ నాయకులు తయారు చేస్తున్న నకిలీ మద్యం కేసుతో జోగి రమేష్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు మాట్లాడుతూ.. బీసీల ఎదుగుదలను ఓర్వలేక జోగి రమే ష్‌పై అక్రమ కేసులు పెట్టారని ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జోగి రమేష్‌ అక్రమ కేసులో పోలీస్‌ యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్విని యోగం చేసిందన్నారు. మోంథా తుపానుతో ఉమ్మడి కృష్ణాలో పంటలు దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న చేపట్టనున్న ప్రజా ఉద్యమం పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గరికపాటి శ్రీదేవి, ఎంపీపీలు వేముల కొండ లక్ష్మీతిరుపతమ్మ, ఇస్లావత్‌ ప్రసన్నరాణి, చెన్ను ప్రసన్న కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు మందా జక్రధరరావు, పార్టీ నాయకులు సర్నాల తిరుపతిరావు, వేములకొండ తిరుపతిరావు, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, మేడపాటి నాగిరెడ్డి, పచ్చిగోళ్ల పండు, గుంజ శ్రీనివాసరావు, పోరంకి శ్రీనివాసరాజు, మిక్కిలి శరభయ్య, నల్లమోతు దయాకర్‌, కోమటి కోటేశ్వరరావు, కుంచం జయరాజు, కోల కాని శ్రీనివాసరావు, గోగులమూడి రాణి, సెశెట్టి ఈశ్వరి, ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement