దుర్గగుడి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధికి విజయవాడకు చెందిన భక్తులు రూ.10 లక్షల విరాళం సమర్పించారు. ప్రకాష్ ఆర్ట్స్ అధినేత సి.డి.వి.సుబ్బారావు, పుష్పలత దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్‌ను కలిసిన సుబ్బారావు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. అనంతరం దాత సుబ్బారావు దంపతులతో పాటు కుమారుడు వెంకట సత్యప్రకాష్, కుమార్తె లక్ష్మీరిషిత, రామమణికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు ఆలయ చైర్మన్, ఈఓ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.
స్టాప్.. వాష్.. రీఫ్రెష్ అండ్ గో
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ‘స్టాప్.. వాష్.. రీఫ్రెష్ అండ్ గో’ అమలు చేస్తున్నారు. రాత్రిపూట డ్రైవర్లకు నిద్ర రాకుండా వాహనాలను ఆపి, వారికి నీరు అందించి ముఖం కడుక్కుని, సేదతీరి తిరిగి డ్రైవింగ్ చేసేలా చూస్తున్నారు. శనివారం వేకువజామున మహానాడు రోడ్డు, సత్యనారాయణపుం, భవానీపురం, గొల్లపూడి, తిరువూరు, జి.కొండూరు ప్రాంతాల్లో జాతీయ రహదా రులపై ఈ కార్యక్రమం నిర్వహించారు.
వీధి కుక్కలకు
ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్లు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేకంగా ఆహారం అందించే ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నగరంలోని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే వీధి కుక్క లకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జంతు ప్రేమికులు ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆహారాన్ని అందించాలని కోరారు. ఎక్కడపడితే అక్కడ ఆహారం అందించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలోని 61 ప్రాంతాలను నిర్ణయించామని, వీటిని ఫీడింగ్ జోన్లుగా గుర్తిస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో వీటి సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. నగర ప్రజలు ఈ ప్రాంతాల్లో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం అందించి సహకరించాలని కోరారు.
విద్యా కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వాలని వినతి
పాయకాపురం(విజయవాడరూరల్): వార్డు సచివాలయాల్లో విద్యాకార్యదర్శులుగా పని చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడు, మంత్రి కె.అచ్చె న్నాయుడుని శనివారం కలిసి వినతి పత్రం అందజేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా కార్యదర్శుల ఐ.కా.స. చైర్మన్ బి.ఘంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి మంత్రి వర్గ ఉపసంఘం సమావే శంలో ఈ అంశంపై చర్చిస్తానని చెప్పారని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఐ.కా.స. కన్వీనర్ జి.యశ్వంత్, కో కన్వీనర్లు శ్రీకాంత్, రాజశేఖర్ ఉన్నారు.
దుర్గగుడి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
దుర్గగుడి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
దుర్గగుడి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం


