భూగర్భ గరళం | - | Sakshi
Sakshi News home page

భూగర్భ గరళం

Oct 19 2025 6:05 AM | Updated on Oct 19 2025 6:05 AM

భూగర్భ గరళం

భూగర్భ గరళం

● రాయనపాడు నుంచి కొల్లేరు వరకూ ఈ ప్రభావం ఉందని వెల్లడి ● బుడమేరుకు రెండు వైపులా రెండు కిలోమీటర్లు మేర ప్రభావం ● 60 నుంచి 80 అడుగుల లోతులో నైట్రేట్స్‌, నికిల్‌, కాడ్మియం, సీసం ● భూగర్భ జలాల్లో ఈకోలి, టైఫో బ్యాక్టీరియాలను గుర్తించిన వైనం ● కేంద్ర భూగర్భ జలశాఖ, ప్రైవేటు సంస్థల అధ్యయనాల్లో నిర్ధారణ బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో నీటిలో వ్యాధికారక లోహాలు ● వివిధ పంటల సాగుకు పొలాల్లో నైట్రోజన్‌ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వరదల సమయంలో పొలాల్లోని నీరు మురుగు కాలువల ద్వారా బుడమేరులో కలుస్తోంది. దీంతో అధిక మోతాదులో నైట్రేట్‌ బుడమేరులోకి చేరుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ● వివిధ సర్వీసు సెంటర్ల నుంచి వచ్చే మురుగు నీరు ఓపెన్‌ డ్రెయిన్‌ల ద్వారా బుడమేరులో కలుస్తోంది. వాటిలో బ్యాటరీ నుంచి వచ్చే మెటీరియల్‌, ఆయిల్స్‌ వంటి వాటిలో నికిల్‌, కాడ్మియం, జింక్‌ వంటివి ఉంటున్నాయని నిర్ధారించారు. ● వాల్‌ పెయింటింగ్స్‌ నుంచి వర్షం వచ్చినప్పుడు సీసం నీటి ద్వారా మురుగు కాలువల్లోకి చేరు తోంది. అలాంటి నీరు భూగర్భ జలాల్లో కలిసి కలు షితానికి కారణం అవుతోంది. ● సైడు డ్రెయిన్లు, సెప్టిక్‌ ట్యాంకులు, అస్తవ్యస్తంగా ఉన్న భూగర్భ డ్రెయినేజీ ద్వారా మురుగు నీరు ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. దీంతో భూగర్భ జలాల్లో ప్రమాదకర ఈకోలి, టైపో వంటి బ్యాక్టీరియాలు ఉంటున్నాయి. ● పలు కంపెనీల నుంచి కూడా రసాయనిక వ్యర్థాలను తీసుకు వచ్చి బుడమేరులో కలుపుతున్నారు. ఇటీవల పీసీబీ అధికారులు అలాంటి వారిని పట్టుకున్నారు.

ప్రభావం ఇలా..

నైట్రేట్‌తో బ్లూబేబీ సిండ్రోమ్‌ కారణంగా పుట్టే పిల్లల గుండెల్లో రంధ్రాలు ఉండటం, పెద్ద వారిలో గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడతాయి.

నికిల్‌, కాడ్మియంతో కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు ఫెయిల్యూర్‌ కావచ్చు.

సీసం కారణంగా చర్మవ్యాధులు, బ్రెయిన్‌పై ప్రభావం చూపుతాయి.

ఈకోలి బ్యాక్టీరియా కారణంగా డయేరియా ప్రబలుతుంది.

టైఫో బ్యాక్టీరియాతో టైఫాయిడ్‌ సోకుతుంది.

ఇతర బ్యాక్టీరియాల కారణంగా కామెర్లు సోకే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.

ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం

లబ్బీపేట(విజయవాడతూర్పు): భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. వాటిని నేరుగా తాగడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు నామమాత్రంగా శుద్ధిచేసి సరఫరా చేస్తున్న ఆర్‌ఓ ప్లాంట్ల నీరు కూడా ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విజయవాడ సింగ్‌నగర్‌లో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు. అందుకు కారణం తెలుసుకునేందుకు అనేక మంది వివిధ రకాల సర్వేలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూగర్భ జలశాఖ కూడా సర్వేలు చేసింది. ఈ అధ్య యనాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో 60 నుంచి 80 అడుగుల లోతుల వేసిన బోర్లు నుంచి నైట్రేట్స్‌, నికిల్‌, కాడ్మియం, సీసం, జింక్‌ వంటి వ్యాధికారిక లోహాలు, ఈకోలి, టైఫో బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి రాయనపాడు, కవులూరు నుంచి కొల్లేరు వరకూ బుడమేరుకు రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర ప్రభావం చూపుతున్నాయి.

కలుషితానికి కారణాలివే..

భూగర్భ జలాల్లో గుర్తించిన నైట్రేట్‌, నికిల్‌, కాడ్మియం, సీసం, జింక్‌ వంటివి ఉండాల్సిన మోతాదులో ఉంటే ప్రమాదం ఏమి లేదని, కాకుంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు చెపుతున్నారు.

బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రాయనపాడు నుంచి కొల్లేరు వరకూ భూగర్భ జలాలు కలుషితమైనట్లు ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది. ఆ ప్రాంతంలో 60 నుచి 80 అడుగుల్లో ఉన్న బోర్లు ద్వారా వచ్చే నీటిలో నైట్రేట్స్‌, నికిల్‌, కాడ్మియం, సీసం, జింక్‌ వంటివి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. వాటితో పాటు ఈకోలి, టైఫో బ్యాక్టీరి యాలు కూడా ఉన్నాయి. ప్రజలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి. లేకుంటే అనేక ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

– డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌,ఫిజిక్స్‌ హెచ్‌ఓడీ, ఆంధ్రా లయోల కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement