విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Oct 18 2025 7:37 AM | Updated on Oct 18 2025 7:37 AM

విజయవ

విజయవాడ సిటీ

శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం –10లోu

న్యూస్‌రీల్‌

గళం విప్పిన జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతంపై పెల్లుబికిన నిరసనలు పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించిన జర్నలిస్టులు జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేత

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
‘సాక్షి’పై వేధింపులు అప్రజాస్వామికం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 30,411 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,760 క్యూసెక్కులు వదులుతున్నారు.

సమస్యలు పరిష్కరిస్తేనే..

పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులు బహిష్కరించి విజయవాడలోని ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

వివాహ సుముహుర్తాలు, చిన్నారులకు అన్న ప్రాసనలు, దీక్షలు స్వీకరించిన భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది.

సామాన్యులు, నిరుపేదలు నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దనే ఉద్దేశంతోనే సాక్షి వార్తలు రాస్తోంది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్న వైనాన్ని మాత్రమే సాక్షి బహిర్గతం చేస్తోంది. సారాతో ప్రాణాలకు ప్రమాదం అని దానిని నిషేధించారు. ఇప్పుడు నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయి అని రాస్తే కేసులు కడతారా? అంటే నకిలీ మద్యం తాగినా ఫర్వాలేదా? సమాజానికి మేలు చేసేందుకే జర్నలిస్టులు పనిచేస్తున్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటర్‌, విలేకరులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

– బి. రాఘవరెడ్డి, నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి, సాక్షి

లబ్బీపేట(విజయవాడతూర్పు): కలంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు గళం విప్పారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పిడికిలి బిగించి నినదించారు. సాక్షి దినపత్రిక కార్యాలయాలు, ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ‘సాక్షి’పై పోలీసుల చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు.

నిజాలు రాస్తుంన్నందుకే..

విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహంకు వినతిపత్రం సమ ర్పించారు. సాక్షి పత్రికపై జరుగుతున్న వేధింపుల తీరును ఆయనకు వివరించారు. సత్యమేవ జయతే అంటూ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై కుట్ర పూరితంగా.. పోలీసులను అడ్డుపెట్టుకుని చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఆర్‌ఓకు ఇచ్చిన వినతిపత్రంలో జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నకిలీ మద్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిందని, అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని వివరించారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై అక్కసుతో అణచివేతే అక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నారు. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు.

నకిలీ మద్యం బహిర్గతమైన నాటి నుంచి..

నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన నాటి నుంచి వరుసగా ఐదో రోజులుగా ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు హల్‌ చల్‌ చేస్తున్నారని, ఎడిటర్‌ ధనంజయ రెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా విజయవాడ, నెల్లూరులోని కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని ఎడిటర్‌ను వేధింపులకు గురి చేస్తున్న పోలీసుల చర్యలు పూర్తిగా సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుల చర్యలను జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలుగా తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రమణారెడ్డి, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామకృష్ణ, అరుణోదయ సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌, సాక్షి ఏపీ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి బి.రాఘవరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి నాగవెంకటరెడ్డి, సాక్షి టీవీ ఏపీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ నిద్దన సతీష్‌, బ్యూరో ఇన్‌చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి, ఎడిషన్‌ ఇన్‌చార్జి చందు శివాంజనేయులు, డీజీఎం కేఎస్‌ అప్పన్న, విజయవాడ బ్రాంచి మేనేజర్‌ ఆర్‌.యశోద్‌రాజ్‌, స్టేట్‌బ్యూరో సీనియర్‌ రిపోర్టర్స్‌ ఎ.రామ్‌ గోపాల్‌రెడ్డి, మాణిక్యాలరావు,

సెంట్రల్‌ డెస్క్‌, మఫిసిల్‌ డెస్క్‌ సభ్యులు, సర్కులేషన్‌ ఏజీఎం వి.నరేంద్ర, టీయూసీనేత కోన సుధాకర్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

ప్రజలకూ ఇబ్బందే..

ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని పత్రికలకు ఒకే విధమైన నియమనిబంధనలు ఉండాలి. కేవలం సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. ఇది ముమ్మాటికి రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికల్లో వచ్చే వార్తల్లో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ ఇవ్వడం మంచి పద్ధతి. అలా కాకుండా పోలీసులతో వేధింపులకు గురిచేస్తుండడం దారుణం. – ఎగ్గొని గాంధీ,

దళిత బహుజన పరిరక్షణ సంఘ నేత

ఉయ్యూరు ఆర్‌డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందిస్తున్న

జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు

మైలవరం తహసీల్దార్‌ అబ్దుల్‌ దరియాకు వినతిపత్రాన్ని

అందజేస్తున్న జర్నలిస్టులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు

విజయవాడలో రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జర్నలిస్టులు, ఆయా సంఘాల నాయకులు

9

జిల్లాలోని ఇతర ప్రాంతాలలో..

ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని కోరుతూ సాక్షి దినపత్రిక మైలవరం ఆర్‌సీ ఇన్‌చార్జ్‌ వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి వైఎస్సార్‌ సీపీ నాయకులు మైలవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ అబ్దుల్‌ దరియాకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నందిగామ నియోజకవర్గంలో సాక్షి దినపత్రిక నందిగామ ఆర్‌సీ ఇన్‌చార్జ్‌ బొక్కా ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సాక్షి ఆర్‌సీ ఇన్‌చార్జి ఈడే శివప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయం వద్ద పలువురు పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, పాత్రికేయులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. పలువురు నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

విజయవాడ సిటీ1
1/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/12

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ12
12/12

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement