
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం సాక్షి పత్రికపై 15 నెలల కాలంలో 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఇక్కడి జర్నలిస్టులు ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారనే అక్కసుతోనే కేసులు పెడుతున్నారు. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బెదిరించి, భయపెట్టే ధోరణిలో హైదరాబాద్‌లోని కార్యాలయంలో మూడు రోజుల పాటు ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిని వేధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. ఇది దుర్మార్గమైన చర్య.
– నిద్దన సతీష్, సాక్షి టీవీ ఏపీ ఇన్‌పుట్ ఎడిటర్