
ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ జిల్లా స్థాయి టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): స్థానిక మొగల్రాజపురంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా జిమ్మాస్టిక్స్ టోర్నీ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. మినీ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ సంది రెడ్డి లక్ష్మీనారాయణ అతిథిగా హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు..
మినీ జూనియర్స్(బాలికలు) ప్లోర్ విభాగంలో పి. లహరి, ట్రంప్ లైన్ విభాగంలో పి.మౌల్య, బీమ్ విభాగంలో పి.లాస్య మొదటి స్థానాల్లో నిలిచారు. మినీ జూనియర్స్(బాలురు)– ప్లోర్ విభాగంలో జి.శశాంత్, ట్రంప్‌లైన్ విభాగంలో జి.కార్తికేయ మొదటి స్థానంలో ఉన్నారు. అండర్–9 బాలికల ఏరోబిక్స్ విభాగంలో దివ్య, ప్లోర్, బీమ్ విభాగాల్లో బస్వతా మొదటి బహుమతిని పొందారు. అండర్–10 బాయ్స్ ప్లోర్ విభాగంలో వి.సూర్య, ట్రంప్‌లైన్, ఏరోబిక్స్ విభాగాల్లో యు.సూర్య మొదటి స్థానంలో నిలిచారు. అండర్–12 బాలికల ప్లోర్, భీమ్, ఏరోబిక్స్ విభాగాల్లో వి.మౌనిక మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ట్రంప్‌లైన్‌లో ఎ.తాత్విక మొదటి, వి.మౌనిక ద్వితీయ బహుమతి పొందారు. విజేతలను అతిథులు అభినందించారు.