బోధనేతర పనిభారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

బోధనేతర పనిభారం తగ్గించాలి

Oct 10 2025 6:38 AM | Updated on Oct 10 2025 6:38 AM

బోధనే

బోధనేతర పనిభారం తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకుల వినతి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం తగ్గించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు సచివాలయంలో కలిసి గురువారం వినతిపత్రం అందజేశామని ఆంధ్ర ప్రదేశ్‌ ఎస్సీ,ఎస్టీ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎండీ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నీ విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని, డీఏతో పాటుగా పీఆర్‌సీ, ఐఆర్‌ కూడా ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని, పీఎఫ్‌ లోన్స్‌ను వెంటనే జమ చేయాలనే అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి అన్ను వెంకటరావుతో పాటుగా సభ్యులు లోకేష్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

గంజాయితో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

నాలుగు కేజీల గంజాయి స్వాధీనం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండియా రాజ్‌, విష్ణు ముత్తు కుమార్‌ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్‌లుగా చేసి తిరుపూర్‌ కళాశాల ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు ఈ నెల 8న బరంపూర్‌లోని న్యూ బస్‌స్టేషన్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్కొక్కరు రూ.10వేలకు రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసుకున్నారు. అక్కడ నుంచి బిలాస్‌పూర్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి ఈ నెల 9న మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగారు. వీరిపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జీఆర్‌పీ సిబ్బంది నాలుగో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా ఒక్కో బ్యాగులో రెండు కేజీల చొప్పున మొత్తం నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తూర్పు, గాజుల కాపు సంక్షేమానికి కృషి

చిలకలపూడి(మచిలీపట్నం): తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్‌కు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్‌ కేటాయించిందని ఆ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ పాలవలస యశస్వీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా తూర్పు, గాజుల కాపు కులస్తులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వీరికి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం పొందటంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ఐఏఎస్‌, గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీసీ కులస్తులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ కె. రాజేంద్రబాబు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారం బహూకరణ

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్‌ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు.

బోధనేతర పనిభారం తగ్గించాలి 1
1/3

బోధనేతర పనిభారం తగ్గించాలి

బోధనేతర పనిభారం తగ్గించాలి 2
2/3

బోధనేతర పనిభారం తగ్గించాలి

బోధనేతర పనిభారం తగ్గించాలి 3
3/3

బోధనేతర పనిభారం తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement