ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే

Oct 12 2025 8:03 AM | Updated on Oct 12 2025 8:03 AM

ప్రైవ

ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే

ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే

ప్రజలు పాల్గొనాలని పిలుపు..

పామర్రు: పేదలకు మెరుగైన వైద్యసేవలను అందించే విషయంలో సీఎం చంద్రబాబుకు అడుగుముందుకు పడటం లేదనే విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారని మాజీఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం వాల్‌ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణతో తనపార్టీ శ్రేణులకు లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ప్రజాఉద్యమం చేపట్టి సమస్యను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో ఐదు కళాశాలలు పూర్తి చేశారని గుర్తుచేశారు. మరో మూడు కళాశాలల పనులు తుదిదశకు చేరుకున్నాయని వివరించారు. ఈ మెడికల్‌ కాలేజీల పనులను పూర్తి చేస్తే వైఎస్సార్‌ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన సీఎం చంద్రబాబుకు ఆపనులను పూర్తి చేయడానికి మనస్సు రావడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆ మూడు మెడికల్‌ కాలేజీల్లో అన్ని సదుపాయాలు సమకూర్చినా తుదిదశ పనులు చేసి ప్రారంభించేందుకు చంద్రబాబు భయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయడం ఇష్టం లేకనే వాటిని పార్టీశ్రేణులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే కచ్చితంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పునారాలోచించి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈనెల 25న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆయా ర్యాలీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజాసంఘాలతోపాటు ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వ అనుమాష చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, తాడిశెట్టి శ్రీనివాసరావు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, నడకుదురు రాజేంద్ర, కూసం పెద వెంకటరెడ్డి, గవాస్కరరాజు, నవుడు సింహాచలం, సజ్జా సుబ్రమణ్యం, నత్తా రవి, అజీజ్‌, తిరుమలశెట్టి వాసు, దిట్టకవి తదితరులు పాల్గొన్నారు.

కై లే అనిల్‌కుమార్‌ డిమాండ్‌

ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే 1
1/1

ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement