
మద్యం షాపుల నుంచి శాంపిల్స్ సేకరణ
కోనేరుసెంటర్: మచిలీపట్నంలోని మద్యం షాపుల్లో ఎకై ్సజ్ పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను సేకరించారు. ములకలచెరువు నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడిచిన నాలుగురోజులుగా ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో 21షాపులు, ఏడు బార్లు ఉండగా ఎకై ్సజ్ ఇన్‌చార్జ్ సీఐ, ఎస్సైలు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మద్యం అమ్మకాలను పరిశీలించారు. యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేసి ఏ డిస్టలరీ నుంచి సరఫరా అయినదీ తనిఖీ చేశారు. కిట్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించారు. షాపుల నిర్వహణ సమయపాలనపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ 21 మద్యం షాపులకు సంబంధించి 15మద్యం శాంపిల్స్, బార్ల నుంచి ఏడు శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ నిబంధనల మేరకే వ్యాపారులు మద్యం అమ్మకాలు సాగించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.