
బైక్ దగ్ధం– నలుగురికి గాయాలు
తిరువూరు: తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయరహదారిపై శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఓ బైక్ దగ్ధం కాగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఆంజనేయపురంనకు చెందిన కల్యాణ్ ద్విచక్రవాహనంపై మరో ఇద్దరితో కలిసి తిరువూరు నుంచి ఇంటికి వెళ్తుండగా, కాకర్లకు చెందిన నరసింహ అనే వ్యక్తికి చెందిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈక్రమంలో నరసింహాకు చెందిన బైక్ నుంచి పెట్రోలు లీకై వాహనం పూర్తిగా దగ్ధమెంది. ఈ ఘటనలో నరసింహా, కల్యాణ్‌లతోపాటు బైక్‌పై ప్రయాణిస్తున్న ఆంజనేయపురంనకు చెందిన మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన యువకులు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.