
క్యూలు కిటకిట
దర్శనం కటకట
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. అమ్మను దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్‌లో రద్దీ ఏకధాటిగా కొనసాగింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు, భవానీలకు ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడంతో సర్వదర్శనం క్యూలైన్ కిటకిటలాడింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ ఎంతకూ ముందుకు కదలకపోవడంతో నిలబడలేక పలువురు భక్తులు నేలపై కూర్చుండిపోయారు. మరోవైపు రద్దీ, ఉక్కపోత కారణంగా చిన్నపిల్లలు అల్లాడారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

క్యూలు కిటకిట