విజయవాడ జాతీయ ప్రధాన రహదారిలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎదురుగా పెద్ద గుంత
ఊర్మిళనగర్ నుంచి కబేళా సెంటర్‌కు వెళ్లే మార్గంలో
రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు
డబ్బు దండుకునే దార్లు వెతుక్కోవడమే అధికార పార్టీ నేతలకు లక్ష్యంగా మారింది. ప్రజాప్రయోజన కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉత్సవాల పేరిట జనం జేబులు ఖాళీ చేసే పనులకే పెద్దపీట వేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి నగరంలో వివిధ ప్రదేశాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 27వ తేదీ నుంచి గొల్లపూడి వై జంక్షన్ సమీపంలో పంటకాలువ రోడ్డులో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఇంత హడావిడి చేస్తున్న నేతలకు కనీసం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అధ్వానంగా ఉన్న రహదారులను బాగు చేయాలన్న కనీస స్పృహ లేకపోవడం విచారకరం. ఈ రోడ్లపై వెళ్లే వాహనదారులు ఉత్సవాల స్వాగత ద్వారాలు చూసి డబ్బు దండుకోవడానికే ఈ కార్యక్రమాలంటూ అధికార పార్టీ నేతల తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
– నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే మాకేం లాభం?
ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే మాకేం లాభం?
ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే మాకేం లాభం?