
రెచ్చిపోతున్న
ఇసుక మాఫియా
మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, ఫెర్రీ వద్ద నదిలో ఇసుక తవ్వుతూ కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. భారీసైజు పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలు బిగించి ఇసుక తోడేస్తున్నారు. ఒడ్డుకు చేరిన ఇసుక మ్యాన్యువల్ క్రేన్‌ల ద్వారా ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. 20 పడవల ద్వారా కృష్ణానది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిపి కృష్ణమ్మకు గర్భశోకం మిగుల్చుతున్నారు. 20 పడవల ద్వారా వచ్చిన ఇసుకను 18 మ్యాన్యువల్ క్రేన్‌లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవల యజమానులు క్రేన్, తాము ఆక్రమించిన స్థలానికి నెలకు రూ.3 లక్షల అద్దె డిమాండ్ చేస్తున్నారంటే ఫెర్రీ రేవులో ఇసుకకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.