
పింఛన్‌లతో సామాజిక భద్రతకు భరోసా
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ పింఛన్‌లతో పేదల సామాజిక భద్రతకు భరోసా లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామంలో ప్రారంభమైన పింఛన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్‌దారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో 2,30,277 పింఛన్‌లకు గాను దాదాపు రూ. 99.55 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ప్రతినెలా పింఛన్‌ల పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పంపిణీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని మూడు కుటుంబాల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ నాంచారరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎంపీడీవో నితిన్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.