
ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన
పెడన: తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు పెడన మండల శాఖ ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పెడన బస్టాండు సెంటరు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఇన్‌చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీ్త్ర శక్తి పథకం అమలు వల్ల కిరా యిలు కరువయ్యాయని, జీవితం దుర్భరంగా మారిందని వాపోయారు. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం రూ.25 వేలు ఇవ్వాలని, జీఓ 21ని రద్దు చేయాలని, ఇన్సూరెన్సులు, పెట్రోలు, డీజిల్ సబ్సిడీపై ఇవ్వాలని, బ్యాంకుల్లో వడ్డీ లేని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు పి.నరసింహారావు, ఆటో యూనియన్ నాయకులు షేక్ బాజీ, పులి రమేష్, వి.దేవ పాల్గొన్నారు.