
మీడియాకు దూరం.. దూరం!
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న అధికారులు మీడియాకు మాత్రం దూరం దూరంగా ఉంటున్నారు. దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం రెండో సమీక్ష సమావేశం నిర్వహించింది. మొదటి సమీక్ష సమావేశంలోనూ మీడియాకు దూరంగా ఉన్న అధికారులు, ఇప్పుడూ అదే పంథాను అనుసరించారు. మూడు గంటల పాటు అధికారులు సమీక్ష నిర్వహించగా, మీడియాతో మాట్లాడేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఉత్సవ ఏర్పాట్లలో క్షేత్రస్థాయిలో లోపాలను మీడియా ఎత్తి చూపుతుందనే భావనతోనే దూరంగా ఉంటున్నట్లు దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది.