భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర శివారులో ఉన్న జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలనీలోని కొత్త బ్లాకుల వద్ద గల చెరువులో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగి వంటిపై లైట్ బ్లూ కలర్ చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మణికట్టుకు కాశీదారం ఉన్న గుర్తు తెలియని ఆ వ్యక్తి చెప్పులు, కండువా చెరువు గట్టుపై వదిలేసి చెరువులో దూకి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.