
ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం
మధురానగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ కార్యవర్గం ఏకగ్రీవమైంది. విజయవాడలో ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ ప్రచార సభ ఏపీ గౌరవ అధ్యక్షుడిగా కొల్లి సీతారాం గురుస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగార్జున రాజ్ గురుస్వామి, సహాయ కార్యదర్శిగా గాడు గురునాథ్ గురుస్వామి, జోనల్ కార్యదర్శిగా ఇంకొల్లు శ్రీను గురుస్వామి, కార్యవర్గ సభ్యులుగా నరసింహారావు స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు లంక బాబు, జాతీయ కార్యదర్శి తాతి నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచారి, కోశాధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.