
యువ మేధకు చుక్కాని.. ఆర్‌టీఐహెచ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువ మేధస్సుకు పదునుపెట్టి, ప్రోత్సహించి పరిశ్రమల స్థాపన దిశగా చేయిపట్టి నడిపించడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) కీలకపాత్ర పోషిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. యువ మేధకు ఆర్‌టీఐహెచ్ చుక్కాని వంటి దని పేర్కొన్నారు. విజయవాడ స్పోక్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో టీమ్ – ఆర్‌టీఐహెచ్ కొత్త ఉత్సాహంతో కృషి చేయాలని జేసీ సూచించారు. ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్ స్పోక్ కార్యాలయానికి సంబంధించి సీఈఓగా జి.కృష్ణన్, ఇంక్యుబేషన్ హెడ్‌గా డి.రవి తేజకు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శనివారం నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా విజయవాడతో పాటు రాష్ట్రంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో స్పోక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.