యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి | - | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి

May 9 2025 1:16 AM | Updated on May 9 2025 1:16 AM

యాక్ష

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు నివారణ కోసం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బుడమేరు పరిరక్షణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకో కుంటే బెజవాడ ప్రజలకు మళ్లీ కన్నీళ్లు తప్పేలా లేవు. గత ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీన నగరాన్ని ముంచెత్తిన బుడమేరు సృష్టించిన కల్లోలం ఇంకా బాధితులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొద్దిపాటి వర్షం పడినా రోడ్లపై వర్షపునీరు నిలుస్తుంటే మళ్లీ వరదలు ముంచేస్తాయేమోనన్న భయం స్థానికులను వెంటాడుతోంది. బుడమేరులో ఆక్రమణలను తొలగించి, ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని, పూర్తిస్థాయి యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తామన్న ప్రభుత్వం హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. బుడమేరు వెంబడి రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తాం, గండ్లు పూడ్చేస్తాం, హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లకు మరమ్మతులు చేపడతామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలిపో యాయి. వరద సమయంలో ప్రభుత్వం హడావిడి తప్ప, తరువాత దాని గురించి పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వేసవిలో బుడమేరు ప్రక్షాళనకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించకపోతే వచ్చే వర్షాకాలంలో మళ్లీ వరద ముంచెత్తుతుందని భయపడుతున్నారు. ప్రక్షాళన పనులను పట్టించుకోని ప్రభుత్వం నామ మాత్రంగా పూడిక తీసి సరిపెడుతోంది.

శాశ్వత ప్రణాళికలంటూ హడావుడి

బుడమేరు వరదల సమయంలో విజయవాడను ముంపు రహితంగా మార్చేందుకు శాశ్వత ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం హడావిడి చేసింది. తొలి దశలో నగర పరిధిలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని ఐదు వేల నుంచి పది వేల క్యూసెక్కులకు పెంచుతామని, ఇందుకు రూ.500 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమిక అంచనాలు రూపొందించింది. వరదలకు బడుమేరులో ఆక్రమణలే కారణమని గుర్తించారు. ఎక్కువ వ్యవసాయ ఆక్రమణలు ఉన్నాయి. విద్యాధరపురం నుంచి గుణదల వరకు నగర పరిధిలోనే 202 ఎకరాలకు 70 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని, 3,051 ఇళ్లు నిర్మించారని గుర్తించారు. బుడమేరు పాత కాలువ నగరంలో ఇళ్లమధ్యగా ప్రవహిస్తోంది. యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి పాముల కాలువ, ముస్తాబాద్‌ కెనాల్‌ మీదుగా ఎనికేపాడు కెనాల్‌ను విస్తరించడం ద్వారా బుడమేరుకు వచ్చే వరద నీటిని మళ్లించొచ్చని అధికారులు సూచించారు. చీమలవాగు, కేసర పల్లి, ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని కూడా పెంచాలని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల పొడవునా కాలువ గట్లను బలోపేతం చేయాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలకు మంగళం పలికారు.

వర్షాకాలం సమీపిస్తుండటంతో బెజవాడ వాసుల్లో భయం పూర్తిస్థాయి బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకోని అధికారులు వరదల సమయంలో యాక్షన్‌ ప్లాన్‌ అంటూ పాలకుల హడావుడి తూతూ మంత్రంగా పూడిక తీసి సరిపెడుతున్న వైనం

బుడమేరులో పూడికతీతతో సరి

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి1
1/2

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి2
2/2

యాక్షన్‌ ప్లాన్‌కు స్వస్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement