
యోగాంధ్ర నిర్వహణకు బృందాల ఏర్పాటు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో యోగాంధ్ర–2025 కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి యోగా శిక్షకులు మండలాల వారీ గా మాస్టర్ ట్రైనీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్థాయిల్లో యోగా సాధన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్‌చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, డీఎంఅండ్‌హెచ్‌వో కన్వీనర్‌గా మొత్తం 24 మంది సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. మండల, పట్టణ స్థాయి కమిటీలో మునిసిపల్ కమిషనర్ లేదా ఎంపీడీవో చైర్మన్‌గా, ఎంఈవో కన్వీనర్‌గా, ఇతర అధికారులు కో–కన్వీనర్, సభ్యులుగా మొత్తం తొమ్మిది మంది ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డులో అడ్మిన్ సెక్రటరీ చైర్మన్‌గా, వీఆర్వో, ప్రధానోపాధ్యాయులు, పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలు సభ్యులుగా ఉంటారన్నారు. షెడ్యూలు ప్రకారం ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో 56 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించామన్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా జిల్లా
ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ