
బీచ్ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు బ్రాంజ్
విజయవాడస్పోర్ట్స్: ఖేలో ఇండియా మొదటి జాతీయ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్ పురుషుల జట్టు సత్తా చాటింది. ఈ నెల 19వ తేదీ నుంచి డామన్‌డయ్యులో ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. తొలుత లీగ్ పోటీల్లో హిమాచల్‌ప్రదేశ్‌ను 41–38, ఉత్తర్‌ప్రదేశ్‌ను 42–37, హరియాణాను 42–39 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో రాజస్థాన్‌పై 40–43 తేడాతో ఓడి మూడో స్థానంలో నిలిచి పతకాన్ని అందుకుంది. జట్టులో నవీన్ (నెల్లూరు), లక్ష్మారెడ్డి(ప్రకాశం) రాణించి జట్టు విజయాలకు తోడ్పాటు అందించినట్లు కోచ్‌లు సాతేంద్రసింగ్, పి.చైతన్య తెలిపారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పతకాన్ని సాధించిన జట్టును ఆంధ్రప్రదేశ్ బీచ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు అభినందించారు.