
కోటిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
వైఎస్సార్ సీపీ రీజనల్
కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
పామర్రు: ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఏరువ కోటిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కోటిరెడ్డి లేని లోటు తీరనిదన్నారు. ఏరువ కోటిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌తో కలిసి సుబ్బారెడ్డి బుధవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రారంభం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కోటిరెడ్డి అని సుబ్బారెడ్డ కొనియాడారు. అనంతరం కోటిరెడ్డి భార్య విజయలక్ష్మి, కుమా రుడు అజయ్‌కుమార్‌రెడ్డి, కుమార్తె ఫణిప్రియను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభకే పట్టం
సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు
పెనమలూరు: సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకే సీట్లు కేటాయిస్తామని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. కానూరులో సిద్ధార్థ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష(ఎస్‌ఈఈఈ) 2025 ఫలితాలను ఆయన బుధవారం ప్రకటించారు. ఉత్తమ మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ ఇచ్చామని, 470 మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రూ.3 కోట్ల స్కాలర్‌షిప్‌లిస్తామని తెలిపారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య మాట్లాడుతూ.. అకాడమీ పరిధిలోని విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నా మని తెలిపారు. వైస్ చాన్స్‌లర్ పి.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఎస్‌ఈఈఈ ప్రవేశ పరీక్షలో ఎం.రేష్మశ్రీ, అబ్దుల్ కౌసర్, మల్లినేని మణి తేజ ర్యాంకులు సాధించగా వీరితో పాటు జేఈఈలో ప్రతిభ చాటిన బొప్పన హర్షిత, ఎం. జె.సుమతో కలిపి ఐదుగురి పూర్తి ట్యూషన్ ఫీజు రాయితీ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు 900 ర్యాంకుల వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవి చంద్ర, డీన్‌లు జి.ఎన్.స్వామి, డి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

కోటిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం