
ప్రతి గింజా కొనాల్సిందే..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడరూరల్: రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. గత నెల 14న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడును సంద ర్శించి ధాన్యం మొత్తం కొంటామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అమలుకాకపోవడం ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉందో చెబుతోందన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ కోటేశ్వరరావు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుడ్డి రమేష్ గ్రామంలో పర్యటించారు.
పొంతనలేని మాటలు
ధాన్యం కొనుగోలులో మంత్రి మనోహర్ చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతన లేదని రామకృష్ణ విమ ర్శించారు. పది లారీల లోడు ధాన్యాన్ని సంచుల్లో నింపి 15 రోజులైనా పైడూరుపాడుకు లారీలు పంప కుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ధాన్యం తడిసిపోయి రంగు మారుతోందన్నారు. పైడూరుపాడుకు లారీలను పంపించి రైతులను ఆదుకోవాలని కోరారు.