కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 88,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 83,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 19,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 68,946 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఇన్‌చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.