
సీపీ రాణాకు జ్ఞాపిక అందజేస్తున్న పోలీస్ వన సమారాధన నిర్వాహకులు
విజయవాడ స్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిపాలనా విభాగం నున్న వికాస్ కాలేజీ సమీపంలోని సామ్రాజ్య రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించిన కార్తిక వన సమారాధన ఉత్సాహభరితంగా సాగింది. చిన్నారులు చేసిన భరతనాట్యం, పలు సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మ్యూజికల్ చైర్, పలు ఆటల, పాటల పోటీలు ఉల్లాసంగా సాగాయి. ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా హాజరై ఆటల, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరనీ ఒకే వేదికపై చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం నిర్వాహకులు సీపీ రాణాకు జ్ఞాపిక అందజేశారు. డీసీపీలు వి.అజిత, ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, మోకా సత్తిబాబు, ఏసీపీలు సి.హెచ్. శ్రీనివాసరావు, కార్యాలయ ఏవో రంగారావు పాల్గొన్నారు.