
మాలల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున
విజయవాడరూరల్: మాలల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం నున్న గ్రామంలోని చినకంచిలో మాలల
ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన మంత్రి నాగార్జున మాట్లాడారు. మాలలు ఐక్యంగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాలల సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ హాలు విజయవాడలో నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మాలల సంక్షేమం కోసం తాను అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మాలల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెత్తం విజయ్‌కుమార్ మాట్లాడుతూ కమ్యూనిటీహాలు నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చందా కిరణ్‌తేజ, ప్రధాన కార్యదర్శి పెనమాల నాగకుమార్, కోశాధికారి సత్తెనపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.