కంచికచర్ల: ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని పరిటాలలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీవీఎస్ సుబ్రహ్మణ్యం కథనం మేరకు... నందిగామకు చెందిన ఓ ముస్లిం యువతి రెండవ సారి గర్భం దాల్చింది. అయితే ఆమె కాన్పు చేయించుకుందామని రెండు రోజుల కిందట పరిటాలలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు షేక్ అసీర్ అహ్మద్ 18 నెలల బాబు కూడా ఉన్నాడు. ఆ చిన్నారి ఆదివారం నాడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్‌కు చెందిన ఓ ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆ చిన్నారి మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కడుపులో ఉన్న బిడ్డ బయటకు రాకుండానే పుట్టిన బాబు మృత్యు ఒడికి చేరటం బాధాకరమని తీవ్రంగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.