
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): స్థానిక తిరుపతమ్మ మండల దీక్ష మాలధారణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో కె. రమేష్‌నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను ఆదివారం ఆలయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారి ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అలాగే 2024, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు అర్ధ మండల దీక్ష మాలధారణ, ఫిబ్రవరి 23 దీక్షాస్వాముల తిరుముడి సమర్పణ, రాత్రికి అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఉమాపతి, తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.
స్విమ్మింగ్ పోటీలకుజిల్లా జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: సౌత్‌జోన్ అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల జట్లను ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి కె.రమేష్ తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ స్విమ్మింగ్ పూల్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. బాలురు, బాలికల జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్‌రెడ్డి, కృష్ణాజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ చైర్మన్ వై.సురేష్, అధ్యక్షులు డి.వి.డి.వి.భాస్కర్, కార్యదర్శి వి.వినోద్, కోశాధికారి పి.బాలమురళీకృష్ణ, సర్ విజ్జి మునిసిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఇన్‌చార్జ్ డి.రమేష్‌బాబు, కోచ్‌లు గాంధీనగర్‌లోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం అభినందించారు.
ఏషియన్ టెన్నిస్ పోటీల్లో ఇషాన్ సత్తా
విజయవాడ స్పోర్ట్స్: బెంగళూరులో జరిగిన కేఎస్‌ఎల్‌టీఏ ఏషియన్ అండర్–14 టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు ఇషాన్ యడ్లపల్లి సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌తో సత్తా చాటాడు. బాలుర సింగిల్స్ ఫైనల్స్‌లో నాల్గో సీడ్ ఎస్.సువర్ణను 6–4, 6–4 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. అదే విధంగా డబుల్స్ ఫైనల్స్‌లోనూ ఇషాన్ యడ్లపల్లి తన భాగస్వామి ఆహాన్ మిశ్రాతో కలిసి నాల్గో సీడ్ జోడి ఎ.పళణిస్వామి–ఇషాన్ సుదర్శన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఏషియన్ పోటీల్లో విజేతగా నిలిచిన ఇషాన్‌ను ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జయదేవ్, రామ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి మల్లికార్జునరావు అభినందించారు.
ఉమ్మడి జిల్లా బాడీ బిల్డింగ్ జట్టు ఎంపిక
పెనమలూరు: అనకాపల్లిలో ఈ నెల 17వ తేదీన జరగనున్న మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టు ఎంపిక చేశామని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈదా రాజేష్, అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. కానూరు అశోక్ జిమ్‌లో ఆదివారం ఉదయం క్రీడాకారుల సెలక్షన్ నిర్వహించి జట్టు ఎంపిక చేశామన్నారు. 64 కేజీల విభాగంలో ఎండీ జాఫర్ సాధిక్, బి.గోపి, 65 కేజీల విభాగంలో కె.బాలకృష్ణ, 80 కేజీల విభాగంలో ఆర్.గోపీకృష్ణ, 85 కేజీల విభాగంలో ఎన్. గిరీష్, 90 కేజీల విభాగంలో ఎస్.ఉదయ్‌కుమార్ ఎంపికయ్యారన్నారు. దివ్యాంగుల విభాగంలో పి.సంతోష్‌కుమార్, మాస్టర్స్ విభాగంలో ఎన్.గిరిష్ ఎంపికయ్యారని తెలిపారు. జట్టు ఇన్‌చార్జిగా ఎండీ సాజిద్ ఉంటారన్నారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఎస్‌ఐ రమేష్ అభినందించారు.


