వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు

Bathukamma Dasara Celebrations Held In Portland City Charter - Sakshi

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ పోర్ట్లాండ్‌ సిటీ చార్టర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్‌ ప్రెసిడెంట్‌ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం  ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు.

బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్‌బలయ్‌ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్‌ డ్రా విజేతలకు టీడీఫ్‌ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top