UAE: దుబాయ్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు | Sakshi
Sakshi News home page

UAE: దుబాయ్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

Published Fri, Dec 22 2023 3:22 PM

AP Cm Ys Jagan Birthday Celebrations Held At Dubai - Sakshi

యూఏఈలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. దుబాయ్‌లోని కరమా పార్క్‌లో వైఎస్‌ జగన్‌ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూఏఈ కన్వీనర్ సయ్యద్‌ అక్రం, ఇర్షాద్‌, చక్రి, అబ్దుల్లా, ఖాజా అబ్దుల్ , విజయ భాస్కర్ రెడ్డి ,సిరాజ్‌లతో పాటు వందలాది అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్‌ అన్న మీద ఉన్న అభిమానం దేశాలు దాటి ఇలా విస్తరించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల దీవెనలతో జగన్‌ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని వారు ఆకాంక్షించారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని యూఏఈ కన్వీనర్‌ సయ్యద్‌ అక్రం మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి వైభవంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.


 

Advertisement
Advertisement