● విజేతలను అభినందించిన వీసీ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ వుమెన్ కాంపిటీషన్ కం సెలెక్షన్స్‌ను వీసీ యాదగిరిరావు మంగళవారం ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో వీసీ చెస్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోర్నమెంట్‌లో ఎంపికై న క్రీడాకారిణులు హైదరాబాద్‌లోని వోక్సన్ యూనివర్సిటీలో అక్టోబర్ 9 నుంచి 12 వరకు నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ వుమెన్ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. వర్సిటీ పరిధిలోని పలు అనుబంధ కళాశాలల విద్యార్థినులు చెస్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, ఫిజికల్ డైరక్టర్లు బీఆర్‌నేత, బాలమణి, రమాదేవి, సదానందం, సంజీవరెడ్డి, సౌజన్య, శ్రావణి, రూప చెస్ పోటీలను పర్యవేక్షించారు. చెస్ కాంపిటీషన్‌లో విజేతలుగా హర్షిత, నవ్య జ్యోతి, శిరీష, నిహారిక, దీక్షిత నిలిచారు. అనంతరం వీసీ తన చాంబర్‌లో విజేతలను అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ పాలకమండలి సభ్యుడు సీహెచ్ ఆంజనేయులు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి, టూటా అధ్యక్షులు పున్నయ్య, పీఆర్‌వో రమణాచారి, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్ నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు బాలమణి, రమాదేవి, జూనియర్ అసిస్టెంట్ జాదవ్ నరేశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


