సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి మార్గం చూపి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి మార్గం చూపి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి మార్గం చూపి

● ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

● రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సిరికొండ, నల్లవెల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డులో ఉన్న రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధుల సమస్యలను ఆయన స్వయంగా విన్నారు. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

సిరికొండ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని గ్రామ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అలాగే ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రీ సర్వే నిర్వహించాలని ఆర్డీవోను ఆదేశించారు. అర్హులైన భూనిర్వాసిత రైతులను గుర్తించి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement