రష్యాలో చిక్కుకున్న వారి కోసం చొరవ | - | Sakshi
Sakshi News home page

రష్యాలో చిక్కుకున్న వారి కోసం చొరవ

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

● స్వదేశానికి రప్పించేందుకు

రూరల్‌ ఎమ్మెల్యే ప్రయత్నాలు

డిచ్‌పల్లి: రష్యాలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రవీందర్‌, అశోక్‌, ప్రకాశ్‌లను స్వదేశానికి రప్పించేందుకు రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉపాధి కోసం రష్యా వెళ్లి మోసపూరితంగా రష్యా సైన్యంలో పనిచేయాల్సిన పరిస్థితిలో చిక్కుకున్న వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి ఇటీవల లేఖ రాశారు. ఎమ్మెల్యే సలహా మేరకు బాధిత కుటుంబ సభ్యులు తమ వారిని సురక్షితంగా రక్షించి భారత్‌కు తిరిగి తీసుకురావాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ లో సీఎం రేవంత్‌ రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేరిట వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు, ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల్‌ విజయలక్ష్మి, స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. రష్యా సైన్యంలో చిక్కుకున్న వారికి అవసరమైన దౌత్య సహాయం అందించి, వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై అధికారులను ఆదేశించారు. తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement