నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్‌లో ఓ వ్యక్తి హత్య కు గురయ్యాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. ఖానాపూర్‌కు చెందిన చాకలి సంఘం లింగం(55) భార్య గత సంవత్సరం మృతిచెందగా, అ ప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. తన ఇంట్లో బుధవారం రాత్రి అతడు నిద్రపోయా డు. గురువారం ఉదయం అతడి ఇంట్లో నుంచి పొ గలు వస్తుండటం చూసి స్థానికులు పోలీసులకు స మాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చే రుకొని చూడగా, లింగం హత్యకు గురైయ్యాడు. రాత్రివేళ గుర్తుతెలియని దుండగులు అతడి తలపై ఫ్యాన్‌తో కొట్టి, దుప్పట్లు వేసి కాల్చి వేసినట్లు గుర్తించారు. ఏసీపీ ప్రకాష్, రూరల్ ఎస్‌హెచ్‌వో ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతుడి మేనల్లుడు బాలు ిఫిర్యాదు మేరకు కేసునమో దు చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు.


