ఆర్మూర్‌టౌన్: వృద్ధులను ప్రతిఒక్కరు గౌరవించి వారికి అవసరమైన సేవలు చేయాలని సీనియర్ సీవిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో గురువారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీదేవిఽ మాట్లాడుతూ.. వృద్ధుల బాగోగులను కుటుంబసభ్యులు తప్పక చూసుకోవాలన్నారు. వారి సంక్షేమానికి చట్టపరమైన అండ ఉంటుందని తెలిపారు. పెన్షనర్స్‌లో అసోసియేషన్ సభ్యులు రాజేశ్వర్, నవజీవన్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: హైదరాబాద్‌లో నేడు ఎస్జీటీయూ ఆధ్వర్యంలో జరిగే నిరాహార దీక్ష వాయిదా పడినట్లు జిల్లా ఎస్జీటీయూ అధ్యక్షుడు వెంకటరమణ గురువారం తెలిపారు. ఎస్జీటీయూల నిరాహారదీక్ష కోసం రాష్ట్ర నాయకులు నాలుగు రోజులుగా అనుమతి కోసం ప్రయత్నం చేశారని, గాంధీ జయంతి సందర్బంగా అనుమతి లభించలేదన్నారు. నిరాహార దీక్ష కార్యక్రమానికి బదులుగా జిల్లాలోని మండల, డివిజన్‌తోపాటు జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి, వినతిపత్రం అందించాలని తెలిపారు. నిరాహారదీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది సమాచారం ఇస్తామని తెలిపారు.
ఖలీల్‌వాడి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ (థియరీ, ప్రాక్టికల్ ) పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించినట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి 17 వరకు థియరీ పరీక్షలు జిల్లా కేంద్రంలోని ఏహెచ్‌వీ పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు పూటలు కొనసాగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 23 నుంచి 30 వరకు 8 రోజులపాటు నగరంలోని ఖిల్లా జూనియర్ కాలేజీలో నిర్వహించబడుతుందన్నారు.
ఆర్మూర్‌టౌన్: సిబ్బంది విధుల్లో అలసత్వం వ హించొద్దని, లేదంటే చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. ప ట్టణంలోని ఏరియా ఆస్పత్రిని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ ఐఏఎస్ సురేష్, డీఎంహెచ్‌వో రాజశ్రీ గురువారం సందర్శించారు. ఈసందర్భంగాఆయన ఆర్మూర్ డివిజన్‌స్థాయి పర్యవేక్షణ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారుల విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డుల నిర్వహణ ను పరిశీలించారు. సూపర్వైజర్లు ఏఎన్‌ఎంల ప నితీరునుఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూ చించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, సూపరింటెండెంట్ ప్రమిద రెడ్డి పాల్గొన్నారు.


