క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

కాలువలో పడి బాలుడి మృతి..

రెంజల్‌: మండలంలోని అలీసాగర్‌ ఎత్తి పోతల కాలువలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. వివరాలు ఇలా.. రెంజల్‌ మండలం కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన బాలాజీ(16) అనే బాలుడికి మతిస్థిమితం సరిగా ఉండదు. అతడు బుధవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు పక్కనే గల అలీసాగర్‌ ఎత్తిపోతల వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కాల్వలో నీటి ప్రవాహం తగ్గించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చందాలు వేసికొని అంత్యక్రియలు..

మృతుడి నానమ్మ పుణ్యవతి గతంలో సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆమె కుమారుడు, కోడలు నవీపేట్‌లోని దాబాహోటల్‌లో కూలీలుగా పనిచేశారు. మనవడి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానిక సర్పంచ్‌ భానుచందర్‌ విరాళాలను అందించాలని వాట్సాప్‌ స్టేటస్‌లో అభ్యర్థించారు. స్పందించిన పలువురు దాతలు విరాళాలను అందించడంతో గ్రా మస్తులు అంత్యక్రియలను నిర్వహించారు.

విద్యుత్‌ షాక్‌తో మహిళ ..

నవీపేట: మండలంలోని ఆశాజ్యోతి కాలనీలో ఓ మహిళ కరెంట్‌షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన నేత లత (40) అనే మహిళ గురువారం భర్త రవితో కలిసి పొలంలో పురుగుల మందు స్ప్రే చేయడానికి వెళ్లింది. ఈక్రమంలో ఆమె చేతిలోని బకెట్‌ కరెంటు తీగలపై పడడంతో కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

నవీపేట: ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ని సుల్తాన్‌పూర్‌ జిల్లా సర్వారి గ్రామానికి చెందిన అభిషేక్‌(28) మండలంలోని బినోల శివారులోని జియోటెక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్‌లో కూలీగా పనిచేసేవాడు. క్రషన్‌ మిషన్‌ సమీపంలో అతడు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్‌ కొక్కెం ఊడిపడింది. పేర్కొన్నారు. అతడికి తీవ్ర గాయాలు కాగా, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ గురువారం మృతి చెందాడు. క్రేన్‌ డ్రైవర్‌ సిద్దిఖీ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, క్రషర్‌ మేనేజర్‌ పురుషోత్తం ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement