‘సేవా సేతు’ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘సేవా సేతు’ను సద్వినియోగం చేసుకోవాలి

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

సుభాష్‌నగర్‌: పీఎం సూర్యఘర్‌ – ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసు కోవడానికి అర్హత కలిగిన వినియోగదారులు సేవా సేతు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు సూచించారు. ఈ పథకంపై వినియోగదారులకు అవగాహన క ల్పించడంతోపాటు అర్హులైన వారిని పథకంలో న మోదు చేసేందుకు సేవాసేతు అవగాహన, నమో దు శిబిరాలను నగరంలోని పవర్‌హౌజ్‌లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు, కేంద్ర సబ్సిడీ, ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం, బ్యాంకు రుణ సదుపాయం, అధీకృత సోలార్‌ విక్రేతల ద్వారా ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియ, తదితర అంశాలపై అధికారులు, సంబంధిత సంస్థల ప్రతినిధులు అవగాహన కల్పించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో సేవాసేతు శిబిరాలు ఈనెల 3వ తేదీవరకు కొనసాగుతాయని ఎస్‌ఈ తెలిపారు. టీజీ రెడ్‌ కో జిల్లా మేనేజర్‌ రవీందర్‌ చవాన్‌, డీఈలు ముక్తార్‌, వెంకటరమణ, హరిచంద్‌, టౌన్‌ ఏడీఈలు చంద్రశేఖర్‌, ప్రసాద్‌రెడ్డి, వినోద్‌, బ్యాంకుల ప్రతినిధులు బిజయ్‌ సాహు, రవికిరణ్‌, కె శ్రీకాంత్‌, పాండరి సురాపవార్‌, నవీన్‌కుమార్‌తోపాటు సోలార్‌ కంపెనీ, డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement