నిజామాబాద్ అర్బన్: స్కానింగ్ కేంద్రాలను ప్రతి మూడు నెలలకోసారి తనిఖీ చేసి వాటి పనితీరును పరిశీలించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం జిల్లా సలహా సంఘ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో తనిఖీలు నిర్వహించిన స్కానింగ్ కేంద్రాలలో జరుగుతున్న లోపాలను గుర్తించి నోటీసులు అందిన వాటిని భవిష్యత్తులో తీసుకున్న చర్యలపై చర్చించామన్నారు. ఎవరైనా స్కానింగ్ కేంద్రాల వారు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సలహా సంఘం కమిటీ సభ్యులు నిషాత్, శరత్, నిషిత, సుప్రియ, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్: పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీకి ప్రతిపాదించిన సభ్యులపై పోలీస్ శాఖ గురువారం ఎంకై ్వరీ పూర్తి చేసింది. జిల్లా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కమిటీలో చరణ్‌రెడ్డి, అంతాజి సతీష్, చెండిసి శ్రీనివాస్, కొంతం మంజుల మురళి, జిమ్మి రవిలను ప్రతిపాదించినట్లు సమాచారం. దేవాదాయ శాఖ అందించే ధూపదీప నైవేద్యాలను అందుకుంటున్న సిద్దులగుట్ట ఆలయ అభివృద్ధి కమిటీపై మొదటిసారిగా పోలీస్ ఎంకై ్వరీ నిర్వహించడంతో చర్చనీయాంశంగా మారింది. ఎంకై ్వరీ కారణంగా ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు కమిటీలో అవకాశం కల్పించలేరంటూ అసహనం వ్యక్తం చేస్తూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమస్యను టీపీసీసీ చీఫ్ మహేశ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.


