● రాజకీయ లబ్ధి కోసమే బహిష్కరణ పేరిట తప్పుడు కేసులు
● గ్రామస్తుల ఆవేదన
నిజామాబాద్ రూరల్: కుల బహిష్కరణ, గ్రామ బ హిష్కరణ వట్టిమాటలేనని అసలు మా ఊర్లో వీడీసీనే లేదని ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామస్తులు అన్నారు. రాజకీయాల లబ్ధి కోసమే గౌడ కు లస్తులు గ్రామస్తులపైన బహిష్కరణ పేరిట తప్పు డు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. గ్రామంలో రెండేళ్ల క్రితం గొడవలు జరుగగా పోలీసులు వచ్చి గొడవలు సద్దుమణిగెల చేశా రన్నారు. తిరిగి ఇప్పుడు అదే రకమైన ఆరోపణల తో మళ్లీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. వారి ఫిర్యాదుతో మహిళ అని చూడకుండా పోలీసు లు విచక్షణరహితంగా దాడి చేశారన్నారు. వెంటనే గ్రామస్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. క్యాదం దేవేందర్, బావు లు, గుండ్ల ఉషన్న, రాజారాం, శ్రీనివాస్, వడ్ల సుదర్శన్, తెనుగు సత్యనారాయణ, బాలకృష్ణ, లింబ వ్వ, లక్ష్మి, లావణ్య, మంజుల పాల్గొన్నారు.


